క్రెడిట్ కార్డు లాభాలు తెలుగులో

1.క్రెడిట్ కార్డు అంటే ఏమిటి ?

ఫ్రెండ్స్ మనలో చాలా మందికి క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. ఇంకా కొంత మందికి దీని గురించి అసలు తెలిసి  ఉండదు. ఇలా తెలియని వారి కోసమే మేము ఈ  అర్టికల్  రాస్తున్నాం.

క్రెడిట్ కార్డు కూడా మనం వాడె డెబిట్ కార్డ్ లాగే ఉంటుంది. దీన్ని మనకు బ్యాంకులు మంజూరు చేస్తాయి.  మనకు కొన్ని ఫైనాన్సింగ్ కంపెనీలు కొంత అమౌంట్ ని అప్పు గా  ఇచ్చి దానిని తిరిగి చెల్లించడానికి కొంత సమయం ఇస్తాయి . మనం ఆ అప్పు మొత్తాన్ని ఇచ్చినటు వంటి సమయంలో చెల్లిస్తే వడ్డీ ఉండదు. అదే సమయం దాటితే కొంత వడ్డీ తీసుకుంటారు. అలాగే ఈ క్రెడిట్ కార్డు లకు కూడా కొంత మొత్తం లో బ్యాంకులు లిమిట్ ఇస్తాయి. మనం ఆ లిమిట్ లో మనకు ఎంత కావాలో అంత తీసుకొని దాన్ని ఒకేసారి తిరిగి చెల్లించకుండా emi లోకి మార్చుకొని నెలనెల కొంచం పే చేసుకోవచ్చు. ఇలా మనం దీన్ని వాడుకున్నందుకు గాను కొంత మొత్తంలో వడ్డీ ని తీసుకుంటాయి. మనకు ఇచ్చిన సమయంలో డబ్బు చెల్లిస్తే వడ్డీ ఉండదు. లేట్ చేస్తే కొంత వడ్డీని కట్టాల్సి వస్తుంది.ప్రస్తుతం ఆన్ లైన్ షాపింగ్ లలో డెబిట్ కార్డుల కంటే క్రెడిట్ కార్డులకే ఆఫర్స్ ఎక్కువగా ఇస్తున్నారు.

2.క్రెడిట్ కార్డు ఎలా తీసుకోవాలి?

మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఏజెంట్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే బ్యాంకు లో అకౌంట్ ఉన్న లేకపోయినా కూడా క్రెడిట్ కార్డ్స్  అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ పొందాలంటే అర్హత ఏమి ఉండాలి, డాకుమెంట్స్ ఏమి కావాలో తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డ్ అర్హత 

మీరు క్రెడిట్ కార్డు పొందాలంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. మీ వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
  2. మీ ఆదాయం సంవత్సరానికి కనీసం 3 లక్షలు ఉండాలి.
  3. భారతీయ పౌరుడై ఉండాలి.
  4. కొన్ని క్రెడిట్ కార్డ్ లకు  నాన్ రెసిడెన్షియల్ కూడా అప్లై చేసుకోవచ్చు.
  5. మీరు మంచి లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్ మీరు పొందాలంటే క్రెడిట్ స్కోర్ మంచిగా ఉండాలి.

క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి కావలసిన డాకుమెంట్స్ 

మీరు క్రెడిట్ కార్డు పొందాలంటే మీ వద్ద ఈ క్రింది పత్రాలు ఉండాలి.

  1.  ఆధార్ కార్డు
  2. పాన్ కార్డ్
  3. పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
  4. మీరు స్యాలరి పర్సన్ అయితే స్యాలరి స్లిప్స్.
  5. ఫారం 16
  6. మీరు బిజినెస్స్ పర్సన్స్ అయితే itr ఉండాలి

మీరు ఆన్లైన్ లో మీకు అవసరం అయిన వెబ్ సైట్ కి వెళ్ళి మీకు కావలిన  క్రెడిట్ కార్డు ని  అప్లై చేసుకోవచ్చు.

3. క్రెడిట్ కార్డు లాభాలు

క్రెడిట్ కార్డ్ వలన అనేక లాభాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఈ క్రింద తెలుసుకుందాం.

  1. మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగించి పేమెంట్స్ చేస్తే రివార్డ్ పాయింట్స్, కాష్ బ్యాక్ ఆఫర్స్ పొందవచ్చు.
  2. క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించి ఇచ్చిన సమయంలో డబ్బు మొత్తన్ని చెల్లిస్తే మీ యొక్క సిబిలి స్కోర్ పెరుగుతుంది. తద్వారా మీరు ఫీచర్ లో ఏదైనా లోన్ కి అప్లై చేస్తే లోన్ వెంటనే అప్ప్రు అవుతుంది.
  3. బయట వారితో అప్పు తీసుకోవడం  ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ క్రెడిట్ కార్డు ల ద్వారా పర్సనల్ లోన్స్ పొందవచ్చు.
  4. మనకు బయట లభించే వడ్డీ రేటు కన్నా క్రెడిట్ కార్డ్లో తక్కువ వడ్డీ  రేటు ఉంటుంది
  5. మీరు ఈ క్రెడిట్ కార్డు ను ఉపయోగించుకొని పెట్రోల్ కొనుగోలు చేస్తే అమౌంట్ అనేది కొంచం తగ్గుతుంది.
  6. మీరు ఏదైనా వస్తువునుఈ కార్డ్ ఉపయోగించి  కొనుగోలు చేశారనుకోండి  దానికి సంభందించిన అమౌంట్ మొత్తం ఒకేసారి కట్టకుండా దానిని emi లోకి మార్చుకొని నెలనెల కొంచం కట్టుకోవచ్చు.
  7. మీరు గనుక ఎక్కువగా విదేశాలకు వెళ్ళేవారు అయితే మీకు ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా ఇందులో లభిస్తాయి.
  8. ఈ క్రెడిట్ కార్డు లు భీమా లను అందిస్తాయి. అవి ఏంటి అంటే ఎయిర్ యాక్సిడెంట్ కవరేజ్, కార్డ్ లాస్ కవర్ లేదా ఫారిన్ హాస్పిటలైజేషన్ కవరేజ్ మొదలైనవి.
  9. ఇందులో మీరు మీ రక్త సంభంధం ఉన్నవారికి యాడ్ కూడా చేసుకోవచ్చు. అంటే యాడ్ ఆన్ కార్డ్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అది కూడా కొన్ని క్రెడిట్ కార్డ్స్ లో ఎటువంటి ఫీలు కట్టకుండా.
  10. మీరు ఈ కార్డు తో atm లోకి వెళ్లి డబ్బు డ్రా కూడా చేసుకోవచ్చు.
  11. ఒక్కోసారి వడ్డీ లేకుండా లో కాస్ట్ emi ఆఫర్స్ కూడా పొందవచ్చు.

4.క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ఎలా చేయాలి?

క్రెడిట్ కార్డు బిల్లు ని మీరు MPS పద్ధతి. BillDesk ద్వారా.  ఆటో డెబిట్ ద్వారా . మొబైల్ వాలెట్ల ద్వారా ఆన్లైన్ లో పే చేసుకోవచ్చు.

FAQ 

  1. Can I use credit card in ATM?
    మీరు క్రెడిట్ కార్డు లను ATM లో ఉపయోగించుకోవచ్చు.
  2. What is credit card in simple words?
    క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంకులచే అందించబడిన ఒక రకమైన క్రెడిట్ సదుపాయం, ఇది కస్టమర్‌లు ముందుగా ఆమోదించబడిన క్రెడిట్ పరిమితిలోపు ని లోన్  తీసుకోవడానికి అనుమతిస్తుంది .
  3. What is the benefit of credit card?
    వీటిలో మీరు వడ్డీ రహిత అంటే వడ్డీ లేని రుణాలు పొందవచ్చు.
  4. What is credit card limit?
    క్రెడిట్ కార్డు ఒక వ్యక్తి కి ఇచ్చేటువంటి మొత్తాన్ని ఈ క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ అంటారు. అంటే అందులో మీరు ఎంత వరకు గరిష్టంగా రుణం పొందగాలరో ఆ మొత్తాన్ని ఆ క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ అంటారు.
  5. Can I withdraw money from credit card?
    క్రెడిట్ కార్డు ద్వారా డబ్బును మీరు తీసుకోవచ్చు. అది కేటాయించిన పరిమితి లోపు తీసుకోవాల్సి ఉంటుంది.
  6. How do I pay my credit card bill?
    మొబైల్ బ్యాంకింగ్ యాప్ లో మీ యొక్క క్రెడిట్ కార్డు బిల్లును కట్టుకోవచ్చు.
  7. When should you use a credit card?
    అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే  క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించండి .
  8. Is ATM card a credit card?
    కాదు.ATM కార్డు డెబిట్ కార్డు కాదు.
  9. Do I need to use my credit card every month?
    మీరు కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడానికి ప్రయత్నించాలి.
  10. What is the best time to pay your credit card bill?
    మీరు నెలనెల చేసే పేమెంట్  గడువు తేదీకి కొన్ని రోజుల ముందు క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లిస్తే మంచిది.

 

Leave a Comment