Bank Of Baroda Credit Cards In Telugu

Bank Of Baroda లో క్రెడిట్ కార్డ్స్ ఎందుకు తీసుకోవాలి?

మన అందరికి బ్యాంకు ఆఫ్ బరోడా బ్యాంకు గురించి తెలిసే ఉంటుంది. ఇది ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు. మన దేశంలో ఉన్నటువంటి బ్యాంకు లలో రెండవ అతి పెద్ద బ్యాంకు. ఈ బ్యాంకు తన కస్టమర్లకు చాలా రకాల సేవలను అందిస్తుంది. వాటిలో క్రెడిట్ కార్డ్స్ ఒకటి. ఈ బ్యాంకు మనకి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ ని అందిస్తుంది.వాటిలో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

bank of baroda credit cards in telugu

Bank Of Baroda బెస్ట్ క్రెడిట్ కార్డ్స్:

  1. IRCTC Bank of Baroda Credit Card
  2. HPCL Bank of Baroda ENERGIE Credit Card
  3. SNAPDEAL Bank of Baroda Credit Card
  4. Bank Of Baroda Easy Credit Card
  5. Bank Of Baroda Select Credit Card

1.IRCTC Bank of Baroda Credit Card In Telugu

bob బ్యాంకు లో ఎక్కువ డిమాండ్ ఈ క్రెడిట్ కార్డు కి ఉంది. దీనిని ప్రతి ఒక్కరు అంటే ఉద్యోగులు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, అందరు తీసుకోవచ్చు. ఈ క్రింద మనం ఈ క్రెడిట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

irctc credit card in telugu 2023

IRCTC Bank of Baroda Credit Card Features In Telugu 

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం IRCTC Bank of Baroda Credit Card లో ఉన్న ఫీచర్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం.

1.Bonus Rewards

ఫ్రెండ్స్ మీకు ఇందులో బోనస్ రివార్డ్స్ లభిస్తాయి. మీరు గనుక ఈ క్రెడిట్ కార్డు తీసుకున్న 45 రోజులలో 1000 లేదా అంతకంటే ఎక్కువ సింగల్ ట్రాన్స్యాక్షన్ చేశారంటే 1000 బోనస్ పాయింట్లు వస్తాయి. వీటిని మీరు ఆన్లైన్ లో రెడిం చేసుకొని వాడుకోవచ్చు.

2.Free Add-on card

ఇందులో మీరు 3 క్రెడిట్ కార్డు లను లైఫ్ టైం ఫ్రీ గా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అన్ కార్డ్స్ అంటే మీ ఫ్యామిలీ లోని వారిని ఈ క్రెడిట్ కార్డు లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నందుకు గాను మీకు ఫీ ఏమి ఉండదు. క్రెడిట్ కార్డు లిమిట్ ని మాత్రం షేర్ చేస్తారు.

3.Extra Rewards

ఫ్రెండ్స్ ఇందులో మీరు extra రివార్డ్స్ ను కూడా పొందవచ్చు. మీరు ఈ క్రెడిట్ కార్డు కి సంబంధించిన వెబ్సైట్ లో ట్రైన్ టికెట్స్ కానీ ఇంకా ఏదైనా వాటిని  100 రూ.. ఖర్చు  చేసి కొనుగోలు చేశారంటే మీకు  2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి.

4.Smart EMI option

irctc క్రెడిట్ కార్డు కి ఉన్న ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్. ఈ కార్డ్లో మీరు ఏదైనా వస్తువులను కొనుగోలు చేసినప్పుడు అమౌంట్ 2,500 కంటే ఎక్కువ అయినప్పుడు emi లోకి మార్చుకొని నెలనెలా కొంచం పే చేసుకోవచ్చు. emi ని  6 నెలల నుంచి 36 నెలల వరకు పెట్టుకోవచ్చు.

5.Fuel Surcharge Waiver

ఫ్రెండ్స్ ఇందులో Fuel Surcharge Waiver పొందవచ్చు. మీరు 500 నుంచి 3000 మధ్య పెట్రోల్ తీసుకున్నప్పుడు  Fuel Surcharge 1% లభిస్తుంది. ఒక స్టేట్‌మెంట్‌కు గరిష్టంగా 100 రూ.. తగ్గుతుంది.

2.HPCL Bank of Baroda ENERGIE Credit Card In Telugu

బ్యాంకు ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ లో HPCL Bank of Baroda ENERGIE Credit Card ఒకటి. ఎవరైతే ఎక్కువగా ఫ్యూయల్ పై ఖర్చు చేస్తుంటారో వారికీ బాగా ఈ క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది.మీరు క్రెడిట్ కార్డు ని use చేసుకొని ఒక సంవత్సరం కి 12,000 .లేదా అంత  కంటే ఎక్కువ అమౌంట్ ని సేవ్ చేసుకోవచ్చు. క్రింద ఈ కార్డు గురించి వివరంగా తెలుసుకుందాం.

HPCL Bank of Baroda ENERGIE Credit Card in telugu

HPCL Bank of Baroda ENERGIE Credit Card Features In Telugu 

ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

1. Reward Points 

ఫ్రెండ్స్ మీరు గనుక యుటిలిటీ బిల్ల్స్, గ్రసిరీష్ వాటిలో 150రూ.. ఖర్చు చేస్తే 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఒక్క 150రూ కి 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇంకా మీరు ఆఫ్ లైన్ లో గనుక గనుక  150రూ.. ఖర్చు చేస్తే 2.రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వీటిని రెడిం కూడా చేసుకోవచ్చు.

2.Fuel Surcharge Waiver

ఫ్రెండ్స్ మీరు గనుక  హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో ఫ్యూయెల్ కొట్టిస్తే.. ప్రతి  150 రూ.. ఖర్చుపై 1% Fuel Surcharge Waiver లభిస్తుంది. చాలా మంది ఈ ఫీచర్ ని చూసి ఈ క్రెడిట్ కార్డు ని ఎక్కువగా తీసుకుంటున్నారు. దీని వలన మీరు 5% అమౌంట్ ని సేవ్ చేసుకోవచ్చు.

3.Airport Lounge Access

ఈ క్రెడిట్ కార్డు లో మీకు  ఒక క్వాటర్ సంవత్సరంలో 4 కంప్లామెంటరి Airport Lounge Access లభిస్తాయి. వీటిని మన దేశంలోనే వినియోగించుకోవాలి.ఈ కార్డు లో ఉన్న ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు.

4. Movie Tickets 

ఫ్రెండ్స్ మీరు paytm మూవీస్ లో 2 మూవీ టికెట్స్ కొంటె మీకు 100 రూ.. వరకు తగ్గుతుంది. అంటే 25% అమౌంట్ తగ్గుతుంది. ఇలాంటి ఆఫర్ ఏ క్రెడిట్ కార్డు లోను లేదు.

5.Annual Fee Waiver

మీరు గనుక ప్రతి సంవత్సరం 50,000 రూ.. ఈ క్రెడిట్ కార్డు లో స్పెండ్ చేశారంటే మీ యొక్క యనువల్ ఫి వే ఆఫ్ అవుతుంది.

6.Joining Rewards

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో మీరు జాయినింగ్ రివార్డ్ పొందవచ్చు. అది ఎలా అంటే క్రెడిట్ కార్డు వచ్చిన 60 రోజులలోపు 5000రూ.. ఖర్చు చేశారంటే మీకు 2000 రివార్డ్ పాయింట్స్ జాయినింగ్ పాయింట్స్ క్రింద వస్తాయి. వీటిని ఆన్లైన్ లో రెడిం చేసుకొని వాడుకోవచ్చు.

3.SNAPDEAL Bank of Baroda Credit Card In Telugu

బ్యాంకు బరోడా బ్యాంకు క్రెడిట్ కార్డు  లో SNAPDEAL Bank of Baroda Credit Card బెస్ట్ క్రెడిట్ కార్డు గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కార్డు లో క్యాష్ బ్యాక్, షాపింగ్ రివార్డ్ పాయింట్స్ ఎక్కువగా వస్తాయి. క్రింద క్రెడిట్ కార్డు గురించి ఇంకొంచం వివరంగా తెలుసుకుందాం.

SNAPDEAL Bank of Baroda Credit Card in telugu 2023

SNAPDEAL Bank of Baroda Credit Card Features In Telugu 

ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

1.Free Add-on card

ఫ్రెండ్స్ ఈ SNAPDEAL క్రెడిట్ కార్డు లో మీరు మీ ఫ్యామిలీ లోని వారిని ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేకున్నప్ప్పుడు  క్రెడిట్ కార్డు లిమిట్ ని షేర్ చేస్తారు. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ 1 లక్ష అనుకోండి. ఇందులో మీకు ఒక 50,000 రూ.. మీరు యాడ్ చేసుకున్న వారికీ 50,000 షేర్ చేస్తారు.

2.Smart EMI Option

మీరు ఆన్లైన్ లో గనుక ఈ కార్డు ని use చేసి షాపింగ్ చేసినప్పుడు అమౌంట్ 2,500 రూ.. కంటే ఎక్కువ అయినప్పుడు దానిని emi లోకి మార్చుకొని, 6 లేదా 36 నెలల టైం టైం పెట్టుకొని నెలనెలా కొంచం పే చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డు కి గల ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్.

3. Interest Free Facility

ఈ ఫీచర్ బ్యాంకు అఫ్ బరోడా బ్యాంకు లో ఉన్న ఏ క్రెడిట్ కార్డు కు లేదు. ఫ్రెండ్స్ మీరు ఏదైనా వస్తువుని కొనుగోలు చేసిన తేది నుండి 50 రోజుల వరకు వడ్డీ ఉండదు. అందుకే ఈ క్రెడిట్ కార్డు కి డిమాండ్ ఎక్కువ.

4. Shaping Rewards 

ఫ్రెండ్స్ మీరు snapdeal యాప్ లో షాపింగ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీరు 100 రూ.. షాపింగ్ లో ఖర్చు చేస్తే 25 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇలాంటి ఆఫర్స్ ఏ క్రెడిట్ కార్డు లోనే లేదు.

5.Activation Benefit 

ఈ క్రెడిట్ కార్డు గల ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్ ఎందుకంటే క్రెడిట్ కార్డు వచ్చిన 30 రోజులలో 500 రూ.. snapdeal  ఓచర్ వస్తుంది. దిన్ని snapdeal యాప్ లో షాపింగ్ చేసేటప్పుడు వినియోగించుకోవచ్చు.

4. Bank Of Baroda Easy Credit Card In Telugu

బ్యాంకు ఆఫ్ బరోడా easy క్రెడిట్ కార్డు ఒక ఎంట్రి లెవెల్ క్రెడిట్ కార్డు. ఎందుకంటే ఇందులో జాయినింగ్ ఫి, యనువల్ ఫి చాలా తక్కువగా ఉంటుంది. ఈ కార్డు లో క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ కూడా ఎక్కువగా వస్తాయి.  ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

Bank Of Baroda Easy Credit Card in telugu 2023

Bank Of Baroda Easy Credit Card Features In Telugu 

ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈజీ క్రెడిట్ కార్డు లో ఉన్న ఫీచర్స్ ఏంటో చూద్దాం.

1.Reward Points  

ఫ్రెండ్స్ మీరు  డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లులో, సినిమాల కోసం  ఖర్చు చేసే ప్రతి 100 రూ.. కి 5 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వీటిని ఆన్లైన్ లో రెడిం చేసుకొని మళ్ళి  మీరు  షాపింగ్ చేసినప్పుడు వాడుకోవచ్చు.

2. Annual Fee Waiver

బ్యాంకు అఫ్ బరోడా ఈజీ క్రెడిట్ కార్డు లో ఉన్న ఫీచర్స్ లో ఇది బెస్ట్ ఫీచర్. ఎందుకంటే క్రెడిట్ కార్డు వచ్చిన 60 రోజులలో 6000 రూ.. లేదా ఒక సంవత్సరం లోపల 35,000 రూ .. ఖర్చు చేస్తే మీ యనువల్ ఫి వేఆఫ్ అవుతుంది.

3. Easy EMI Option 

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో మీరు ఏదైనా వస్తువుని ఆన్లైన్ లో కొనుగోలు చేసునప్పుడు అమౌంట్ మొత్తం ఒకేసారి పే చేయకుండా emi మార్చుకొని నెలనెలా కొంచం పే చేసుకోవచ్చు. అంటే మనం చాలా సులభంగా emi లోకి మార్చుకొని అమౌంట్ ని పే చేసుకోవచ్చు.

4.Fuel Surcharge Waiver

ఫ్రెండ్స్ మీకు బ్యాంకు బరోడా easy క్రెడిట్ కార్డు లో  1% Fuel Surcharge Waiver లభిస్తుంది. చాలా మంది ఈ ఫీచర్ ని చూసి ఈ క్రెడిట్ కార్డు ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ కార్డు ఉన్నటువంటి ఫీచర్స్ లో బెస్ట్ ఫీచర్ గా దీనిని చెప్పుకోవచ్చు.

5.Zero liability on lost card

మీరు ఈ క్రెడిట్ కార్డు ని గనుక పోగొట్టుకున్నా లేదా వేరేవాళ్ళు దొంగలించిన ఒక్కసారి కస్టమర్ కేర్ కి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే వెంటనే వాళ్ళు కార్డు ని బ్లాకు చేస్తారు. బ్లాకు చేసే లోపు ఏమైనా క్రెడిట్ కార్డు ని use చేసుకున్న అమౌంట్ మనం పే చేయాల్సిన అవసరం ఉండదు.

 

ఫ్రెండ్స్ పైన తెలిపిన క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే క్రింద ఇచ్చిన  లింక్ ని క్లిక్ చేయండి

Credit Cards Apply Link

Leave a Comment