HDFC బ్యాంకు లో క్రెడిట్ కార్డ్స్ ఎందుకు తీసుకోవాలి?
ఫ్రెండ్స్ మన అందరికి HDFC బ్యాంకు గురించి తెలిసే ఉంటుంది. ఈ బ్యాంకు ను HDB అని కూడా పిలుస్తారు. HDFC బ్యాంకు ను ఆగస్ట్ 1994 లో ఏర్పాటు చేశారు. HDFC ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకు లలో 10 వ అతి పెద్ద బ్యాంకు. ఈ బ్యాంకు కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. వాటిలో క్రెడిట్ కార్డులు కూడా ఒక భాగం. ఈ ఆర్టికల్ లో మనం HDFC బ్యాంకు లోని బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
HDFC బ్యాంకు బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ :
- HDFC Regalia Credit Card
- HDFC Diners Club Black Credit Card
- HDFC Money Back Credit Card
- HDFC Millennia Credit Card
ఈ కింద వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.
1.HDFC Regalia Credit Card
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు మోస్ట్ పాపులర్ క్రెడిట్ కార్డు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ మిగతా ఏ క్రెడిట్ కార్డ్స్ లోను ఉండవు. HDFC బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ లో బెస్ట్ క్రెడిట్ కార్డు ఇది. ట్రావెల్ చేసేవారికి ఈ క్రెడిట్ కార్డు బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
HDFC Regalia Credit Card Features In Telugu
మనం ఇప్పుడు hdfc Regalia క్రెడిట్ కార్డు లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Airport Lounge Access
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు మనకి 18 Airport Lounge Access ని అందిస్తుంది. ఇలాంటి ఫీచర్స్ ఏ క్రెడిట్ కార్డు లలో లేదు. ఈ 18 లోఒక సంవత్సరంలో 12 మన దేశంలో ఉపయోగించుకోవచ్చు. 6 విదేశాలలో ఉపయోగించుకోవచ్చు.
2.Reward Points
మీరు ఈ క్రెడిట్ కార్డు లో ఒక సంవత్సరంలో 5 లక్షలు స్పెండ్ చేశారంటే మీకు 10,000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇంకా మీరు 8 లక్షలు స్పెండ్ చేశారంటే 5,000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి.మీరు ఆఫ్ లైన్ లో గనుక 150 రూ.. ఖర్చు చేశారంటే మీకు 4 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వీటిని మీరు రీడిం కూడా చేసుకోవచ్చు.
3.Zero Lost card liability
ఫ్రెండ్స్ hdfc బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ లో ఉన్నటువంటి ఫీచర్స్ లో ఇది చాలా ముఖ్యమైనది. మీరు ఎప్పుడైనా HDFC Regalia Credit Card ని పోగొట్టుకున్నప్పుడు కస్టమర్ కేర్ కి కాల్ చేసి కంప్లయింట్ చేస్తే మీ కార్డు ఎవరైనా వాడుకున్నా 9 లక్షల వరకు కవరేజ్ చేస్తారు.
4.Foreign Currency Markup
ఫ్రెండ్స్ మీరు వేరే అంటే విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ క్రెడిట్ కార్డు ని use చేసుకోవచ్చు. ఇలా చేసినందుకు గాను కేవలం 2% మాత్రమే చార్జ్ చేస్తారు. మిగతా క్రెడిట్ కార్డ్స్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ.
5.Fuel Surcharge Waiver
hdfc Regalia క్రెడిట్ కార్డు లో Fuel Surcharge Waiver లభిస్తుంది. అది కూడా 1% లభిస్తుంది. ఈ 1% మీరు పొందాలి అంటే మీరు ఒక నెలలో 400 నుంచి 5000 మధ్య పెట్రోల్ కొనుగోలు చేయాలి.
2.HDFC Diners Club Black Credit Card
hdfc బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ లోHDFC Diners Club Black Credit Card ఒకటి. ఈ కార్డు లో కూడా రివార్డ్ పాయింట్స్ ఎక్కువగా వస్తాయి. క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు గురించి వివరంగా తెలుసుకుందాం.
HDFC Diners Club Black Credit Card Features In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Reward Points
- ఈ క్రెడిట్ కార్డు ని use చేసి ఆఫ్ లైన్ లో 150 రూ.. ఖర్చు చేశారంటే మీకు 5 రివార్డ్ పాయింట్స్ వస్తాయి.
- ఇంకా ఈ క్రెడిట్ కార్డు తో భాగస్వామం కలిగిన బ్రాండ్ లలో ఏదైనా కొనుగోలు చేశారంటే 10X రివార్డ్ పాయింట్‌లు వస్తాయి.
- మీరు వికేండ్స్ లో డిన్నర్ కి వెళ్ళినప్పుడు ఈ బ్యాంకు తో టైఅప్ అయిన రెస్టారెంట్లకు వెళ్ళితే 2X రివార్డ్ పాయింట్‌లు వస్తాయి.
2.Welcome Benefit
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో మీరు వెల్కం బెనిఫిట్ కూడా పొందవచ్చు. అది ఏంటి అంటే Club Marriott, Forbes, Amazon Prime, MMT BLACK, Swiggy One మరియు Times Prime వంటి వాటిలో కాంప్లిమెంటరీ య్యనువల్ మెంబర్ షిప్ ని పొందవచ్చు.
3.Insurance benefit
ఫ్రెండ్స్ HDFC Diners Club Black Credit Card లో ఇన్సూరెన్స్ కూడా పొందవచ్చు. అవి:
- విమాన ప్రమాద మరణ కవరేజీ 2 కోట్లురూ… ఇస్తుంది.
- ఇంకా ఎమర్జెన్సీ ఓవర్సీస్ క్రింద ఆసుపత్రిలో రూ.50 లక్షలు వరకు ఇన్సూరెన్స్ ఇస్తుంది.
- ట్రావెల్ ఇన్సూరెన్స్ 55,000 ఇస్తుంది.
- మీరు ఎప్పుడైనా ఈ క్రెడిట్ కార్డు ని పోగొట్టుకుంటే 9 లక్షల వరకు కవరేజ్ ఇస్తుంది.
4.Free Add-on cards
ఫ్రెండ్స్ ఇందులో మీరు మీ ఫ్యామిలీ మెంబెర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నందుకు గాను ఎలాంటి ఫి వసూలు చేయరు. క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ ని మాత్రం షేర్ చేస్తారు.
5.Fuel Surcharge Waiver
ఇందులో మీకు 1% Fuel Surcharge Waiver లభిస్తుంది. అది కూడా మీరు ప్రతి సారి 400రూ.. కంటే ఎక్కువ పెట్రోల్ కొనుగోలు చేసిన్నప్పుడు ఒక బిల్లింగ్ లో 1000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
3.HDFC Money Back Credit Card
hdfc మనీ బ్యాక్ క్రెడిట్ కార్డు ఒక ఎంట్రి లెవెల్ క్రెడిట్ కార్డు. ఈ కార్డు మనకి క్యాష్ బ్యాక్ ఎక్కువగా ఇస్తుంది. ఈ ఎంట్రి లెవెల్ క్రెడిట్ కార్డు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్డు ని పొందవచ్చు. క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
HDFC Money Back Credit Card Features In Telugu
ఇప్పుడు మనం మని బ్యాక్ క్రెడిట్ కార్డు లో ఉన్న ఫీచర్స్ ఏంటో చూద్దాం.
1.Reward Points
ఫ్రెండ్స్ మీరు గనుక ఆఫ్ లైన్ లో రిటైల షాప్స్ లో ఈ కార్డు ని use చేసి 150 రూ.. ఖర్చు చేశారంటే 2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి.అదే మీరు ఆన్లైన్ లి కనుక 150 రూ.. ఖర్చు చేశారంటే 2x రివార్డ్ పాయింట్స్ వస్తాయి.
2. Welcome Benefit
ఈ క్రెడిట్ కార్డు కు గల ఫీచర్స్ లో ఇది ఒకటి. మీరు జాయినింగ్ ఫి చెల్లించిన తర్వాత 500 క్యాష్ పాయింట్స్ వస్తాయి. వీటిని మీరు ఆన్లైన్ లో రీడిం కూడా చేసుకోవచ్చు.
3.Annual Spend-based Benefit
ఫ్రెండ్స్ మీరు గనుక క్యాలెండర్ క్వాటర్ లో 50,000 ఖర్చు చేశారంటే మీకు 500 గిఫ్ట్ ఓచర్ వస్తుంది. దీనిని ఆన్లైన్ లో షాపింగ్ చేసినప్పుడు ఉపయోగించుకోవచ్చు.
4.Fuel Surcharge Waiver
మని బ్యాక్ క్రెడిట్ కార్డు గల ఫీచర్స్ లో ఇది ఒకటి. ఇందులో మీరు 1% Fuel Surcharge Waiver పొందవచ్చు. మీరు 400 కంటే ఎక్కువ పెట్రోల్ కొనుగోలు చేసినప్పుడు 250 రూ.. క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
5.Zero Lost Card Liability
మని బ్యాక్ క్రెడిట్ కార్డు లో ఉన్న బెస్ట్ ఫీచర్ గా దీనిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా క్రెడిట్ కార్డు పోగొట్టుకున్నప్పుడు వెంటనే కార్డు యొక్క లావాదేవీలను స్టాప్ చేస్తారు. దీని వలన మీకు ఎలాంటి మోసాలు జరగవు.
4. HDFC Millennia Credit Card
hdfc బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ లో hdfc మిలినియా క్రెడిట్ కార్డు ఒకటి. ఆన్లైన్ లో షాపింగ్ చేసే వారికీ ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. Amazon, Flipkart వంటి వాటిలో ఆఫర్స్ వస్తుంటాయి.క్రింద మనం hdfc మిలినియా క్రెడిట్ కార్డు ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
HDFC Millennia Credit Card Features In Telugu
ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
1.Reward Points
ఫ్రెండ్స్ ఈ కార్డు లో 1000 క్యాష్ పాయింట్స్ వస్తాయి. అలాగే ఒక క్యాలెండర్ క్వాటర్ లో 1 లక్ష స్పెండ్ చేస్తే 1000 రూ.. గిఫ్ట్ ఓచర్ వస్తుంది. దీనిని మనం ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు వాడుకోవచ్చు.
2. Cash Back
అమెజాన్, బుక్ మై షో, ఫ్లిప్ కార్ట్, మిత్ర, స్విగ్గి వంటి వాటిలోషాపింగ్ చేసినప్పుడు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మీరు ఆఫ్ లైన్ లో షాప్స్ లో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది.
3.Lounge Access
ఫ్రెండ్స్ ఇందులో మీరు 8 కంప్లామెంటరి Domestic Lounge Access లభిస్తాయి. ఈ బెనిఫిట్ hdfc బ్యాంకు లో ఉన్న క్రెడిట్ కార్డ్స్ లో వేటికి లేదు. వీటిని మనం మన దేశంలోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది.
4.Annual Fee Waiver
ఈ కార్డు కి ఉన్న ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు గనుక ఒక సంవత్సరంలో 1 లక్ష రూ.. ఈ కార్డు పై స్పెండ్ చేశారంటే ఈ కార్డు కి ఉన్న యనువల్ ఫి వెఆఫ్ అవుతుంది.
5.Fuel Surcharge Waiver
ఫ్రెండ్స్ ఈ కార్డు లో 1% Fuel Surcharge Waiver లభిస్తుంది. అది ఎప్పుడంటే మీరు 400 రూ..నుంచి 5,000 రూ.. మధ్య పెట్రోల్ కొనుగోలు చేసినప్పుడు ఒక స్టేట్‌మెంట్ సైకిల్‌కు 250 రూ.. క్యాష్ బ్యాక్ వస్తుంది.