How To Get Personal Loan From Icici Bank In Telugu
ఫ్రెండ్స్ మీకు డబ్బు అవసరం ఉండి? ఈ అవసరాన్ని ఎలా తీర్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం డబ్బు అవసరం తీర్చుకోవడానికి మనకి చాలా రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో పర్సనల్ లోన్ ఒకటి. ఈ పర్సనల్ లోన్ ని తీసుకొని మీరు మీ డబ్బు అవసరాన్ని చాలా సులభంగా తీర్చుకోవచ్చు. ఇప్పుడు మనం సులభంగా పర్సనల్ లోన్ ఇచ్చే బ్యాంకు గురించి తెలుసుకుందాం.
మన అందరికి icici బ్యాంకు గురించి తెలిసే ఉంటుంది. ఈ బ్యాంకు తన కస్టమర్లను చాలా రకాల సేవలు అందిస్తుంది. వాటిలో పర్సనల్ లోన్స్ ఒకటి. ఈ బ్యాంకు మనకి చాలా తేలికగా పర్సనల్ లోన్ ఇస్తుంది. వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంటుంది. ఈ క్రింద మనం ఈ బ్యాంకు లో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఏ డాకుమెంట్స్ ఉండాలో వివరంగా తెలుసుకుందాం.
icici Bank Personal Eligibility In Telugu
ఫ్రెండ్స్ మనం icici బ్యాంకు లో వ్యక్తిగత లోన్ పొందాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరులై ఉండాలి.
- వయస్సు 23 ఏళ్ళ నుంచి 53 ఏళ్ళ మధ్య ఉండాలి.
- మీకు నెలకు జీతం 30,000 ఉండాలి.
- ప్రస్తుతం మీరు చేస్తున్న వృత్తిని రెండు సంవత్సరాల నుంచి చేస్తుండాలి.
- మీ యొక్క రెసిడెన్సియల్ అడ్డ్రెస్ ఏదైతే ఉందొ ఆ అడ్డ్రెస్ లో ఒక సంవత్సరం ఉండాలి.
Icici Bank Personal Loan Required Documents In Telugu
మనం ఈ బ్యాంకు లో పర్సనల్ లోన్ పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- 3 నెలల బ్యాంకు స్టేట్మెంట్
- 3 నెలల స్యాలరి స్లిప్స్
- 2 పాస్ ఫోటోలు
- బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR
- ఫారం 16
Icici Bank Personal Loan Features In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వ్యక్తిగత లోన్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఈ బ్యాంకు లో మనం 50,000 నుంచి 25,00,000 వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు.
- వడ్డీ రేటు 10.50% నుంచి 19%.మధ్య ఉంటుంది.
- 12 నెలల నుంచి 72 నెలల వరకు రీ పేమెంట్ టైం ఉంటుంది.
- లోన్ అప్లై చేసిన 5 నిమిషాల్లో లోన్ అప్రు అవుతుంది.
- 100% డిజిటల్ ప్రాసెస్.
Icici Bank Personal Loan Apply Process In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం icici బ్యాంకు లో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా icici బ్యాంకు వెబ్సైట్ కి వెళ్ళండి.
- మీ వివరాలు ఎంటర్ చేసి మీ యొక్క అర్హతను చెక్ చేసుకోండి.
- వచ్చిన లోన్ అమౌంట్ లో మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
- మీ వృత్తి యొక్క వివరాలను ఎంటర్ చేయండి.
- మీ యొక్క డాకుమెంట్స్ ని అప్లోడ్ చేయండి.
- లోన్ అప్లై చేయండి.