Canara Bank Zero Balance Account Opening Online In Telugu
మన దేశంలో ఉన్నటువంటి పురాతన బ్యాంకు లలో కెనరా బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకు ను ఎ.సుబ్బారావు పాయ్ గారు 1906 లో స్థాపించారు. ఈ బ్యాంకు లో కూడా మనం చాలా రకాల అకౌంట్ లను ఓపెన్ చేసుకోవచ్చు. వాటిలో కెనరా బ్యాంకు జీరో బ్యాలన్స్ అకౌంట్ ఒకటి. ఈ అకౌంట్ ను మనం చాలా సులభంగా ఆన్లైన్ లో ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ లో మనం మినిమం బ్యాలెన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోనందుకు ఎలాంటి జరిమానా ఉండదు
ఈ క్రింద మనం ఈ కెనరా బ్యాంకు జీరో బ్యాలన్స్ అకౌంట్ ఆన్లైన్ లో ఓపెన్ ఎలా చేయాలి?, ఏమి డాకుమెంట్స్ కావాలి, అర్హత ఏమి ఉండాలి అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
Canara Bank Zero Balance Account Eligibility
ఫ్రెండ్స్ కెనరా బ్యాంకు లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 18 ఏళ్ళు ఉండాలి.
- కెనరా బ్యాంకు లో సేవింగ్ అకౌంట్ ఉండకూడదు.
Canara Bank Zero Balance Account Required Documents
కెనరా బ్యాంకు లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మీ వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- ఆధార్ తో లింక్ అయినటువంటి మొబైల్
Canara Bank Zero Balance Account Opening Online In Telugu
ఫ్రెండ్స్ పైన ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఉండాల్సిన అర్హత, డాకుమెంట్స్ గురించి తెలుసుకున్నారు. ఈ క్రింద ఈ జీరో బ్యాలన్స్ అకౌంట్ ని ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం.
- మొదట కెనరా బ్యాంకు వెబ్ సైట్ ఓపెన్ చేసుకోండి.
- అందులో Online SB A/C Opening క్లిక్ చేయండి.
- మీ యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ నెంబర్ కి otp వస్తుంది దాన్ని ఎంటర్ చేయండి.
- తర్వాత మీ డిటైల్స్ ఓపెన్ అవుతాయి. వాటిని చెక్ చేసుకొని కరేట్గా ఉంటె యారో బటన్ క్లిక్ చేయండి.
- పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి.
- వార్షిక ఆదాయం ను సెలెక్ట్ చేసుకోండి.
- మీ యొక్క డిటైల్స్ ఎంటర్ చేయండి.
- తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి ప్రోసిడ్ బటన్ పై క్లిక్ చేయండి.
- తర్వాత కస్టమర్ కేర్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు. మీరు జీరో అకౌంట్ కావాలి అని వాళ్ళకి చెప్తే బ్యాంకు వాళ్ళు ఆ అకౌంట్ ను ఓపెన్ చేస్తారు.
Canara Bank Zero Balance Account Features In Telugu
కెనరా బ్యాంకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ వలన ఏ ఏ ఫీచర్స్ పొందవచ్చో ఈ క్రింద తెలుసుకుందాం.
- ఈ అకౌంట్ లో మినిమం అమౌంట్ మెయిన్ టైన్ చేయనవసరం లేదు.
- మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోనందుకు ఎలాంటి జరిమానా ఉండదు.
- ఉచితంగా ATM కార్డ్ పొందవచ్చు.
- మిగతా అకౌంట్స్ కి ఉన్నట్టు ఈ అకౌంట్ కి కూడా నామినేషన్ సౌకర్యం ఉంటుంది.
- నెట్ బ్యాంకింగ్ వినియోగదారులు ఎప్పుడైనా మరియు ఎక్కడైనా బ్యాంకింగ్ లావాదేవీలను చేసుకోవచ్చు.