
Table of Contents
ToggleMudra Loan అప్లై చేసుకోవటం ఎలా?
Mudra Loan In Telugu
ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రెల్ 15 వ తేది 2015లో సంవత్సరంలో చిన్న వ్యాపారుల అభివృద్దే లక్ష్యంగా ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) స్కీమ్ ప్రవేశపెట్టారు. ఈ పధకం క్రింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ పొందవచ్చు. వీటినే ముద్ర లోన్ అని ప్రస్తుతం పిలుస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరు లోన్ పొందవచ్చు.
ఇందులో వ్యవసాయం, బిజినెస్‌లకు, షాప్ పెట్టుకోవడానికి, ఫోర్ వీలర్ కొనుగోలు చేసేందుకు, బ్యూటీపార్లర్, జిమ్ వంటివి పెట్టుకోవడానికి, ఇంకా ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు లోన్ తీసుకోవచ్చు. ఈ క్రింద మనం ముద్ర లోన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి. ఈ ముద్ర లోన్ పొందాలంటే ఉండాల్సిన అర్హత, డాకుమెంట్స్, లోన్ SBI లో ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
Mudra Loan Types
ఫ్రెండ్స్ ముద్ర లోన్ మనకి 3 రకాలుగా అందుబాటులో ఉంది. వాటి గురించి క్రింద తెలుసుకుందాం.
1.శిశు
శిశు అనేది ముద్ర లోన్ లో మొదటి రకం. ఇందులో మీరు 50,000 వరకు లోన్ పొందవచ్చు.
2.కిశోర్
ముద్రలో ఉన్నటువంటి లోన్స్ లో కిశోర్ రెంవడి. ఇందులో 50,000 రూ.. 5 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
3.తరుణ్
ఫ్రెండ్స్ ముద్ర లోన్స్ లో తరుణ్ చివరిది. ఇందులో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
Mudra Loan Eligibility
ఈ క్రింద మనం ఈ ముద్ర లో లోన్ పొందాలంటే ఏ ఏ అర్హతలు ఉండాలో తెలుసుకుందాం.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.
- sbi బ్యాంకు లో సేవింగ్ అకౌంట్ ఉండాలి.
- sbi బ్యాంకు లో కరెంట్ అకౌంట్ కూడా ఉండాలి.
Mudra Loan Documents Required
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ ముద్ర లో లోన్ పొందాలంటే మన వద్ద ఏ ఏ డాకుమెంట్స్ లో ఉండాలో తెలుసుకుందాం.
- ఐడి ప్రుఫ్ఫ్ కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు మొదలైనవాటిలో ఏదో ఒకటి ఉండాలి.
- అడ్రస్ ప్రుఫ్ఫ్ కోసం కరెంట్ బిల్లు, నీటి బిల్లు, గ్యాష్ బిల్లు మొదలైనవాటిలో ఏదో ఒకటి ఉండాలి.
- బిజినెస్ ప్రుఫ్ఫ్ కోసం బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి.
Mudra Loan Apply Process In Telugu
ఫ్రెండ్స్ ఇప్పటివరకు లోన్ కావాల్సిన అర్హత, డాకుమెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్రింద మనం ఈ లోన్ ని SBI లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
- మొదట క్రింద ఇచ్చిన లింక్ ద్వారా sbi e ముద్ర వెబ్సైట్ లోకి వెళ్ళండి.
- భాషను సెలెక్ట్ చేసుకోండి.
- మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ కి ఒక otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- మీ వివరాలు ఎంటర్ చేసి మీ యొక్క అర్హతను చెక్ చేసుకోండి.
- తర్వాత మీకు వచ్చిన లోన్స్ లో మీకు ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
- మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- లోన్ ని అప్లై చేయండి.
- ముద్ర లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు.
పైన తెలిపిన విధంగా ముద్ర లోన్ ని sbi లో అప్లై చేసుకోవచ్చు.