SBI Credit Cards Benefits In Telugu 2023

SBI Credit Cards Introduction 

ఫ్రెండ్స్ ప్రస్తుతం  మనం బయట షాపింగ్ కి ఎక్కడికి వెళ్ళిన ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ నే ఉపయోగిస్తాము. ఇప్పుడు మనం పొందే ఆఫర్స్ లో క్రెడిట్ కార్డ్స్ కే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి . కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్స్ కు కూడా ఎక్కువ డిమాండ్ ఉంది.

ఫ్రెండ్స్ చాలా మందికి SBI బ్యాంకు గురించి, SBI అందించే క్రెడిట్ కార్డ్స్ గురించి తెలిసే ఉంటుంది. అసలు వీటి గురించి తెలియని వారి కోసం ఈ ఆర్టికల్ రాయడం జరిగింది.ఈ ఆర్టికల్ లో మనం SBI బ్యాంకు అందిచే బెస్ట్  క్రెడిట్ కార్డ్స్ గురించి వివరంగా అంటే ఈ క్రెడిట్ కార్డ్స్ వలన మనం పొందే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

SBI Best  Credit Cards

ఫ్రెండ్స్ SBI మనకి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ ని ప్రోవైడ్ చేస్తుంది. వాటిలో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  1.  SBI Simply Click Credit Card
  2. ,SBI Simply Save Credit Card
  3. SBI Cash Back Credit Card

1. SBI Simply Click Credit Card

SBI అందిచే బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ లో SBI Simply Click Credit Card ముఖ్యమైనది. ఈ క్రెడిట్ కార్డ్ ను  ఎంట్రీ లెవెల్ క్రెడిట్ అని చెప్పవచ్చు. sbi క్రెడిట్ కార్డ్స్ లో రివార్డ్ పాయింట్స్ ఎక్కువగా అందించే క్రెడిట్ కార్డు గా ఈ sbi simply click credit card ని  చెప్పవచ్చు. ఈ  క్రింద మనం ఈ కార్డు యొక్క బెనిఫిట్స్ గురించి క్లియర్ తెలుసుకుందాం.

sbi simply click credit card in telugu 2023

SBI Simply Click Credit Card Benefits 

1.Reward Points 

ఫ్రెండ్స్  మీరు గనుక ఈ sbi simply click credit కార్డు ని ఉపయోగించుకొని  BookMyShow, Cleartrip, Lenskart వంటి వాటిలో షాపింగ్ చేస్తే మీకు 10 టైమ్స్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మీరు 100 రూపాయలు ఖర్చు చేస్తే మీకు 1 రివార్డ్ పాయింట్ వస్తుంది. ఇంకా మీరు ఆన్లైన్ లో ఈ క్రెడిట్ కార్డు ని స్పెండ్ చేశారనుకోండి. మీరు  5x రివార్డ్ పాయింట్స్  పొందవచ్చు.

2.Milestone Rewards

ఫ్రెండ్స్  మీరు ఒక సంవత్సరం లో 1 లక్ష రూపాయలు ఈ క్రెడిట్ లో  స్పెండ్ చేసారంటే మీకు 2,000 రూ,, e ఓచర్ వస్తుంది. మీరు తర్వాత మళ్ళి ఇంకొక 1 లక్ష రూపాయలు స్పెండ్ చేసారంటే అంటే 2 లక్షలు అవుతుంది. అప్పుడు కూడా  మీకు మళ్ళి  2,000 రూ,, e ఓచర్ లభిస్తుంది. ఈ ఒచర్స్ ని క్లియర్ ట్రిప్ లో మీరు ఉపయోగించుకోవచ్చు.

3.Annual fee waiver

ఈ క్రెడిట్ కార్డ్  యొక్క Annual ఫి 499 రూ.. ఉంటుంది. మీరు గనుక ఈ క్రెడిట్ కార్డు పై 1 లక్ష రూపాయలు లేదా అంత కంటే ఎక్కువ స్పెండ్ చేశారనుకోండి ఈ Annual fee వేఆఫ్ అయిపోతుంది.

4.Fuel Benefits 

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డ్లో ఫ్యూయల్ బెనిఫిట్స్ లభిస్తాయి. అది కూడా 1% లభిస్తుంది. ఇక్కడ మీరు 300 నుంచి  500 రూపాయల మధ్య ఖర్చు చేస్తే ఒక బిలింగ్ లో 100 రూ… క్యాష్ బ్యాక్ పొందగలరు.

5. Free Add On Cards 

ఈ sbi simply click క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి బెనిఫిట్స్ లో ఈ యాడ్ ఆన్ కార్డ్స్ బెస్ట్ బెనిఫిట్. ఇందులో మీ ఫ్యామిలి మెంబర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు యాడ్ చేసే పర్సన్ కి వయస్సు 18 ఏళ్ళ పైన ఉండాలి. ఇందులో పర్సన్స్ ని యాడ్ చేసినందుకు ఫీ ఏమి ఉండదు. ఇందులో క్రెడిట్ లిమిట్ షేర్ చేస్తారు. ఉదాహరణకు ఒక లక్ష క్రెడిట్ లిమిట్ అనుకోండి. అప్పుడు మీకొక 50,000రూ.. మీరు Add చేసుకున్న వారికీ 50,000 ఇస్తారు.

6. worldwide Acceptance 

ఫ్రెండ్స్ మనం  ఈ క్రెడిట్ కార్డు ని ప్రపంచంలో ఎక్కడైనా వాడుకోవచ్చు.ఇది కార్డు గల బెస్ట్ బెనిఫిట్ గా  చెప్పుకోవచ్చు.

SBI Simply Click Credit Card Charges In Telugu 

ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ sbi simply click credit card యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి చార్జెస్ గురించి తెలుసుకుందాం.

Late Payment Charges
  1. ఫ్రెండ్స్ మీరు ఈ క్రెడిట్ కార్డ్స్ ని ఉపయోగించి  cash transfer చేశారనుకోండి అంటే atm లో డ్రా చేశారనుకోండి 2.5% ఛార్జ్ చేస్తారు.
  2. మీరు 500రూ. కంటే తక్కువ డ్యూ ఉన్నారనుకోండి మీకు ఛార్జ్స్ ఏమి ఉండవు అంటే “0”
  3. అదే మీరు 500 నుంచి 1000 మధ్య  డ్యూ ఉన్నారనుకోండి మీకు 400రూ.. ఛార్జ్స్ చేస్తారు.
  4. అదే 1000 నుంచి 10,000 మధ్య డ్యూ ఉంటె 750రూ..ఛార్జ్స్ చేస్తారు.
  5. అదే 10,000 నుంచి  25,000 మధ్య డ్యూ ఉంటె 950రూ..ఛార్జ్స్ చేస్తారు.
  6. అదే25,000 నుంచి 50,000మధ్య డ్యూ ఉంటె 1100రూ..ఛార్జ్స్ చేస్తారు.
  7. అదే 50,000 పైన డ్యూ ఉంటె 1300రూ..ఛార్జ్స్ చేస్తారు.

2.SBI Simply Save Credit Card

SBI అందించే క్రెడిట్ కార్డ్స్ లో sbi simply save క్రెడిట్ కార్డు ఒకటి. ఇప్పుడు మనం ఈ sbi  simply save క్రెడిట్ కార్డ్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం.అంటే ఈ కార్డ్లో ఉన్నటువంటి ప్రయోజనాలు,చార్జెస్  మొదలైన వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

sbi simply save credit card in telugu 2023

SBI Simply Save Credit Card Benefits In Telugu 

ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డ్కు సంబంధిన బెనిఫిట్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం.

1.Reward Points 
  • ఫ్రెండ్స్ మీరు ఈ క్రెడిట్ కార్డు ని ఉపయోగించి  ఆన్లైన్ లో ఏవైనా షాపింగ్ చేసి 150 రూపాయలు ఖర్చు చేస్తే మీకు ఒక్క రివార్డ్ పాయింట్ వస్తుంది. ఈ ఒక్క రివార్డ్ పాయింట్ 25 పైసా తో సమానం.
  • ఈ కార్డ్ లో Dining, Movies, Departmental Stores,Grocery లో ఎక్కువ ఆఫర్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ 150 రూపాయలు మీరు ఖర్చు చేస్తే మీకు  10 టైమ్స్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి.
2.Welcome Offer

మీకు ఈ క్రెడిట్ కార్డ్ లో WELCOME OFFER లభిస్తుంది. మీరు ఈ కార్డ్ తీసుకున్న 30 రోజుల లోపు ATM లో  విత్ డ్రా చేసారంటే 100 రూపాయలు కాష్ బ్యాక్ వస్తుంది. ఇది కేవలం మొదటి డ్రా కి మాత్రమే వస్తుంది. ఇది ఈ క్రెడిట్ కార్డు కు గల బెస్ట్ బెనిఫిట్ గా చెప్పుకోవచ్చు.

3. Renewal Fee Waiver

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు మెంబెర్ షిప్ లో ఒక సంవత్సరంలో 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ స్పెండ్ చేశారనుకోండి మీ యొక్క యనువల్ ఫీ 499 వేవాఫ్ అయిపోతుంది. ఇది రెండు సంవత్సరాల వరకు వర్క్ చేస్తుంది. అంటే రెండు సంవత్సరాల తర్వాత మల్లి మీరు యనువల్ ఫీ పే చేసుకోవాలి.

4.Fuel Benefits 

ఫ్రెండ్స్ ఇందులో 1% fuel surcharge లభిస్తుంది. ఇక్కడ మీరు 500 నుంచి  3000 రూపాయల మధ్య ఖర్చు చేస్తే ఒక బిల్లింగ్ లో 100 రూ… క్యాష్ బ్యాక్ వస్తుంది.

5. Add-on Cards 

ఈ క్రెడిట్ కార్డ్ లో ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్ గా దీనిని  చెప్పవచ్చు.ఎందుకంటె ఇందులో రెండు కార్డ్స్ ని యాడ్  చేసుకోవచ్చు. అంటే మీ ఫ్యామిలిలో ఎవరికైనా కార్డ్ కావాలంటే తీసుకోవచ్చు కానీ అమౌంట్ అనేది  లిమిట్ ఉంటుంది.వీటికి ఎటువంటి ఫీస్ ఉండదు. యాడ్ చేసుకొనేవారి వయస్సు 18 ఏళ్ళ పైన ఉండాలి.

6.Balance Transfer on EMI 

ఫ్రెండ్స్ ఈ ఆఫర్ ఏ క్రెడిట్ కార్డు లోను ఉండదు. దీనివలన వేరే క్రెడిట్ కార్డు యొక్క లావాదేవీలు ఈ క్రెడిట్ కార్డ్లో చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వేరే క్రెడిట్ కార్డు లో బిల్లు పే చేయాలి. ఆ కార్డు లో బ్యాలెన్సు లేదు అలాంటప్పుడు ఈ sbi simply save క్రెడిట్ కార్డు నుంచి అమౌంట్ పే చేసుకోవచ్చు. దాన్ని EMI లోకి  మార్చుకొని 3 నెలల లోపల తిరిగి పే చేసుకోవచ్చు.

SBI Simply Save Credit Card Charges In Telugu 

మనం ఇప్పటివరకు ఈ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం. ఈ క్రింద ఈ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి చార్జెస్ గురించి తెలుసుకుందాం.

Late Payment Charges 

  1. ఫ్రెండ్స్ మీరు ఈ క్రెడిట్ కార్డు లో  500 కంటే తక్కువ డ్యూ కలిగి ఉంటె చార్జెస్ 0 గా ఉంటాయి. అంటే చార్జెస్ ఉండవు.
  2. అదే  500 నుంచి 1000  మధ్య డ్యూ ఉంటె 400 రూపాయలు ఛార్జ్ చేస్తారు.
  3. అదే  1000 నుంచి10,000 మధ్య డ్యూ ఉంటె 750 రూపాయలు ఛార్జ్ చేస్తారు.
  4. అదే 10,000 నుంచి 25,000  మధ్య డ్యూ ఉంటె 950 రూపాయలు ఛార్జ్ చేస్తారు.
  5. అదే 25,000 నుంచి 50,000 మధ్య డ్యూ ఉంటె 1100 రూపాయలు ఛార్జ్ చేస్తారు.
  6.  ఇంకా 50,000 పైన డ్యూ ఉంటె 1300 రూపాయలు ఛార్జ్ చేస్తారు.
  7. ఫ్రెండ్స్ మనకు ఇంకొక ఛార్జ్ ఉంది అది ఏంటి అంటే మీరు రెండు సార్లు మినిమం అమౌంట్ పే చేయకపోతే 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు.

3. SBI Cash Back Credit Card

SBI అందించే క్రెడిట్ కార్డు లో sbi cash back credit card బెస్ట్ క్రెడిట్ కార్డు గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో కొనుగోళ్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇందుకు ఎలాంటి షరతులు ఉండవు. మనం ఈ క్రెడిట్ కార్డ్లో ఒక నెలకు 10,000 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డు లో  ఉన్నటువంటి ఫీచర్స్, చార్జెస్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం.

sbi cash back credit card in telugu 2023

SBI Cash Back Credit Card Benefits In Telugu 

ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.

 

1.No Joining Fee

ఫ్రెండ్స్ మనకు లభించే SBI  క్రెడిట్ కార్డ్స్ లో ఇది బెస్ట్ క్రెడిట్ కార్డు గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో జాయినింగ్ ఫీ ఉండదు.

2  .Card Cashback

ఈ క్రెడిట్ కార్డు కి ఈ క్యాష్ బ్యాక్ అనే పేరు 100% సెట్ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే  మనకు ఈ క్రెడిట్ కార్డు లో 5 % అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే ఆఫ్ లైన్ లో బిల్ల్స్ పే చేస్తే  1% క్యాష్ బ్యాక్  లభిస్తుంది.

3. Renewal Fee

ఈ sbi cash back credit card లో జాయినింగ్ ఫి ఉండదు. కాబట్టి.రినివల్ ఫీ 999 ఉంటుంది. వేరే క్రెడిట్ కార్డ్స్ తో పోలిస్తే ఈ అమౌంట్ చాలా తక్కువ.

4. Add-on Cards

మీరు మీ ఫ్యామిలీ మెంబెర్స్ లో ఎవరిననైన ఈ కార్డు లోకి యాడ్ చేసుకోవచ్చు. క్రెడిట్ లిమిట్ అనేది షేర్ చేస్తారు. ఉదాహరణకు: ఈ క్రెడిట్ కార్డు లో 1 లక్ష రూపాయలు క్రెడిట్ లిమిట్ ఉన్నదనుకోండి. ఇందులో మీకొక 50,000 యాడ్ చేసుకున్నవారికి 50,000 లిమిట్ ని షేర్ చేస్తారు. ఇందులో యాడ్ చేసుకునే వారి వయస్సు 18 ఏళ్ళ పైన ఉండాలి.

5. Balance Transfer on EMI

ఈ క్రెడిట్ కార్డు కి సంబంధించిన బెనిఫిట్స్ లో  ఇది అతి  ముఖ్యమైనది. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డు ని ఉపయోగించుకొని వేరే క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లును కట్టవచ్చు. ఆ కట్టిన బిల్లు ఎక్కువ మొత్తంలో ఉంటె దానిని EMI  లోకి మార్చుకొని అంతా ఒకేసారి పే చేయకుండా నెలనెలా కొంచం పే చేసుకోవచ్చు.

6.Complimentary Domestic Lounge

ఫ్రెండ్స్  మనకి ఈ క్రెడిట్ కార్డు లో 4 ఎయిర్ పోర్ట్  Domestic Lounge లభిస్తాయి. ఇది కేవలం మన దేశంలోనే ఉపయోగించువచ్చు.అది కూడా ఒక సంవత్సరం కి ఒక్కసారి మాత్రమే use చేసుకోవచ్చు.ఈ క్రెడిట్ కార్డు కి గల బెనిఫిట్స్ లో ఇది కూడా చాలా ముఖ్యమైనది.

SBI Cash Back Credit Card Charges In Telugu 

మనకి తెలిసి ఏ క్రెడిట్ కార్డు కి అయిన చార్జెస్ ఉంటాయి. అలాగే ఈ sbi cash back క్రెడిట్ కార్డు లో కూడా కోన్ని చార్జెస్ ఉన్నాయి. అవి ఏంటో వివరంగా ఈ క్రింద తెలుసుకుందాం.

Late Payment Charges 

  1. ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో  మీ యొక్క డ్యూ 500రూ. కంటే తక్కువ ఉంటె charges ఏమి ఉండవు. అంటే చార్జెస్ “0”
  2. అదే  మీ యొక్క డ్యూ 500నుంచి 1000 మధ్య ఉంటే 400 రూ.. ఛార్జ్ చేస్తారు.
  3. అదే మీ డ్యూ 1000 నుంచి 10,000 మధ్య ఉంటే 750 రూ.. ఛార్జ్ చేస్తారు.
  4. మీ యొక్క డ్యూ 10,000 నుంచి  25,000 మధ్య ఉంటే 950 రూ.. ఛార్జ్ చేస్తారు.
  5. మీ యొక్క డ్యూ 25,000 నుంచి 50,000 మధ్య ఉంటే 1100 రూ.. ఛార్జ్ చేస్తారు.
  6. మీ యొక్క డ్యూ 50,000 పైన ఉంటె 1300రూ.. ఛార్జ్ చేస్తారు.
  7. ఫ్రెండ్స్ మీరు గనుక రెండు నెలలు వరుసగా మినిమం బ్యాలెన్సు కట్టకపోతే మీకు 100రూ..ఛార్జ్ చేస్తారు.

ఫ్రెండ్స్ మీరు గనుక SBI క్రెడిట్ కార్డు కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

SBI Credit Cards Apply Link 

Leave a Comment