Indusind బ్యాంకు లో పర్సనల్ లోన్ అప్లై చేసుకోవటం ఎలా?
ఫ్రెండ్స్ మీరు బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ పొందాలి అని అనుకుంటున్నారా? అలాగే ఏ బ్యాంకు లో లోన్ అప్లై చేసుకొంటే బెస్ట్ అని ఆలోచిస్తున్నారా? అలా మేము మీ కోసం ఒక బెస్ట్ బ్యాంకు గురించి తెలియచేస్తాము. ఈ బ్యాంకు లో మీరు సులభంగా పర్సనల్ లోన్ పొందవచ్చు.
ఆ బ్యాంకే Indusind బ్యాంకు. ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద బ్యాంకులలో ఈ బ్యాంకు ఒకటి. ఇందులో పర్సనల్ లోన్ చాలా తేలికగా పొందవచ్చు. వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది. ఈ క్రింద మనం ఆన్లైన్ లో ఈ పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి? అప్లై చేయాలి అంటే మనకి ఏమి అర్హత ఏమి ఉండాలి, డాకుమెంట్స్ ఏమి ఉండాలో వివరంగా తెలుసుకుందాం.
Personal Loan Eligibility
ఫ్రెండ్స్ Indusind బ్యాంకు లో వ్యక్తిగత లోన్ పొందాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరులై ఉండాలి.
- వయస్సు 21 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్య ఉండాలి.
- నెలకు 25,000 ఆదాయం ఉండాలి.
- ప్రస్తుతం మీరు చేస్తున్న వృత్తిని రెండు సంవత్సరాల నుంచి చేస్తుండాలి.
- మీ యొక్క రెసిడెన్సియల్ అడ్డ్రెస్ ఏదైతే ఉందొ ఆ అడ్డ్రెస్ లో ఒక సంవత్సరం ఉండాలి.
Personal Loan Required Documents
ఈ బ్యాంకు లో పర్సనల్ లోన్ పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- 3 నెలల బ్యాంకు స్టేట్మెంట్
- మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్
- మీరు బిజినెస్ పర్సన్ అయితే 3 సంవత్సరాల Itr
- 2 పాస్ ఫోటోలు
Indusind Personal Loan Features
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ indusind బ్యాంకు పర్సనల్ లోన్ లో ఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
- మనం ఈ బ్యాంకు లో 30,000 నుంచి 50 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు.
- ఫ్రెండ్స్ ఈ బ్యాంకు లో మనం 5 రకాల పర్సనల్ లోన్స్ పొందవచ్చు. అవి:
-
Personal Loan for Education
-
Personal Loan for Medical Expenses
-
Personal Loan for Home Renovation
-
Personal Loan for Wedding
-
Personal Loan Balance Transfer
- వడ్డీ రేటు 10.25% నుంచి 32.02% మధ్య ఉంటుంది.
- రీ పేమెంట్ టైం 12 నెలల నుంచి 60 నెలల వరకు ఉంటుంది.
- ప్రాసెసింగ్ ఫి 3% ఉంటుంది.
- 100% డిజిటల్ ప్రాసెస్.
Indusind Personal Loan Apply Process In Telugu
ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఈ బ్యాంకు లో పర్సనల్ లోన్ పొందాలి అంటే అర్హత ఏమి ఉండాలి, డాకుమెంట్స్ ఏమి ఉండాలి అని తెలుసుకున్నాం. ఈ క్రింద ఆన్లైన్ లో ఈ పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా బ్యాంకు వెబ్సైట్ కీ వెళ్ళండి.
- మీ ఆధార్, పాన్ కార్డు, మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ కి otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- మీ అడ్రస్ ని చెక్ చేసుకోండి.
- మీకు ఎంత లోన్ వచ్చిందో చెక్ చేసుకోండి.
- వీడియో kyc ని కంప్లీట్ చేసుకోండి.
- మీ బ్యాంకు డిటైల్స్ ఎంటర్ చేయండి.
- లోన్ అప్లై చేయండి.