Idfc Credit Cards In Telugu 2023

IDFC credit cards ఎందుకు తీసుకోవాలి?

ఫ్రెండ్స్ మన అందరికి IDFC బ్యాంకు గురించి తెలిసే ఉంటుంది. IDFC బ్యాంకు ను 1997 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 2015లో రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది.  2015 అక్టోబర్  నెలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారకంగా  ఈ బ్యాంకు ను ప్రారంభించారు. ఈ బ్యాంకు నుంచి మనం చాలా క్రెడిట్ కార్డ్స్ ని పొందవచ్చు.

క్రెడిట్ కార్డ్స్ లో మిగతా  బ్యాంకులతో పోలిస్తే IDFC చాలా బెటర్ అని చెప్పవచ్చు . ఎందుకంటే ఈ బ్యాంకు నుంచి మనం లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ని పొందవచ్చు. ఈ క్రింద మనం IDFC బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

IDFC బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ :-

  1. First millennia Credit Card
  2. First Classic Credit Card
  3. First Select Credit Card
  4. First wealth Credit Card
  5. First Private Credit Card
  6. First Wow Credit Card

ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఒక్కో క్రెడిట్ కార్డు  గురించి వివరంగా తెలుసుకుందాం.

1.First Millennia Credit Card 

Idfc  క్రెడిట్ కార్డ్స్ లో ఫస్ట్ మిలినియా క్రెడిట్ కార్డు మొదటిది. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డు లో తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో రివార్డ్ పాయింట్స్ కూడా ఎక్కువగా లభిస్తాయి. ఈ క్రింద మనం ఈ క్రెడిట్ యొక్క ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

idfc first millennia credit card in telugu

First Millennia Credit Card Features In Telugu

ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ మిలినియా క్రెడిట్ కార్డు లో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1.Annual Fee

IDFC ఫస్ట్ మిలినియా క్రెడిట్ కార్డు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ సంభందించిన ఫీచర్స్ లో ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇందులో annual fee ఉండదు.

2.Low Interest Rates 

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో వడ్డీ రేటు నెలకు 0.75% నుండి 3.5% వరకు ఉంటుంది. మిగతా బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ యొక్క వడ్డీతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

3.Joining Benefits 

idfc Millennia Credit Card లో మనకి జాయినింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇది  ఈ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి ఫీచర్స్ లో అతి ముఖ్యమైనది. ఎందుకంటే క్రెడిట్ కార్డు తీసుకున్న 90 రోజుల లోపు మీరు  15,000 రూ.. లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే మీకు 500 వెల్కం ఓచర్ వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డు తీసుకున్న 90 రోజుల లోపు మీరు EMI పే చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది.

4.Reward Points

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డ్లో మనకి రివార్డ్ పాయింట్స్ కూడా లభిస్తాయి.  మీరు ఒక నెలలో పుట్టిన రోజుకు కానీ మరి ఎలాగైనా 20,000 రూ. ఖర్చు చేస్తే 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అలాగే మీరు ఆన్లైన్ లో కానీ ఆఫ్ లైన్ లో కానీ నెలకు  20,000 రూ. ఖర్చు చేస్తే మీకు 6x నుంచి 3x వరకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్ కి వ్యాలిడిటి అంటూ ఏమి ఉండదు.

5.Late Payment Fee

ఈ క్రెడిట్ కార్డు లో పేమెంట్ ఫి  కేవలం 15% మాత్రమే ఉంటుంది. అంటే 100 రూ.. నుంచి  1250రూ.. మధ్య ఉంటుంది. మిగతా క్రెడిట్ కార్డ్స్ లో పోలిస్తే ఇది  చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు.

2.First Classic Credit Card

IDFC బ్యాంకు లో ఉన్నటువంటి క్రెడిట్ కార్డులలో ఫస్ట్ క్లాసిక్ క్రెడిట్ కార్డు రెండవది. ఈ క్రెడిట్ కార్డు ని సూపర్ రివార్డ్ క్రెడిట్ కార్డు అని కూడా పిలుస్తారు. ఈ క్రెడిట్ కార్డు కూడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది  క్రింద మనం ఫస్ట్ క్లాసిక్ క్రెడిట్ కార్డు ఫీచర్స్ గురుంచి తెలుసుకుందాం.

IDFC first classic credit card in telugu 2023

First Classic Credit Card Features In Telugu 

ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి ఫీచర్స్  గురించి తెలుసుకుందాం.

1.No Annual Fee

ఈ క్రెడిట్ కార్డు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు కాబట్టి ఇందులోAnnual Fee ఫి ఉండదు.

2. Joining Benefits

ఈ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్. మీరు క్రెడిట్  కార్డు తీసుకున్న 90 రోజుల లోపు 15,000 రూ.. లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే మీకు 500 వెల్కం ఓచర్ వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డు తీసుకున్న 90 రోజుల లోపు మీరు EMI పే చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది.

3.Late Payment Fee

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో లేట్ పేమెంట్ ఫి చాలా తక్కువగా ఉంటుంది. 15% ఉంటుంది. అంటే 100 రూ.. నుంచి  1250రూ.. మధ్య ఉంటుంది.

4.Forex Markup

ఈ క్రెడిట్ కార్డ్లో లో ఉన్న ఫీచర్స్ లో forex markup బెస్ట్ ఫీచర్. మనం ఈ క్రెడిట్ కార్డు ను ఉపయోగించి అంతర్జాతీయ లావాదేవీలు చేస్తే మనకి 1.99% చార్జ్ చేస్తారు. ఇలాంటి ఆఫర్ ఇతర క్రెడిట్ కార్డ్స్ లో ఉండదు.

5.Reward Points

ఫ్రెండ్స్ మీరు ఈ క్రెడిట్ కార్డు ను ఉపయోగించి  నెలకు 25,000 రూ.. లేదా అంతకంటే ఎక్కువ ఖర్చులు  చేస్తే మీకు 10X రివార్డ్ పాయింట్‌లు వస్తాయి. అలాగే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లో  వరుసగా 25,000 రూ.. ఖర్చు చేసి  కొనుగోలు చేశారంటే  6Xలేదా  3X  రివార్డ్ పాయింట్‌లు వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్ కి వ్యాలిడిటి ఉండదు.

6.Low Interest Rates 

ఈ క్రెడిట్ కార్డు లో ఇంట్రెస్ట్ రేటు తక్కువగా ఉంటుంది. అది కూడా ఒక నెలకు  0.75% నుంచి  3.5% మధ్య ఉంటుంది. మిగతా బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ.

3.First Select Credit Card

IDFC క్రెడిట్ కార్డ్స్ లో ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డు మూడవది.  IDFC బ్యాంకు అందించే క్రెడిట్ కార్డ్స్ లో అన్నిటికంటే బెస్ట్ క్రెడిట్ కార్డు గా ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డు ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో రివార్డ్ పాయింట్స్ తో పాటు ట్రావెలింగ్ ఆఫర్స్ సంవత్సరం పొడవునా ఉంటాయి. ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్న ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

IDFC first select credit card in telugu

First Select Credit Card Features In Telugu 

ఈ క్రెడిట్ కార్డు లో ఉన్న ఫీచర్స్ ఏంటో క్రింద తెలుసుకుందాం.

1.Reward Points

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు ని use చేసుకొని ఒక నెలలో 25,000 రూ.. లేదా అంతకంటే ఎక్కువ ఖర్చులు  చేస్తే మీకు 10X రివార్డ్ పాయింట్‌లు వస్తాయి. అలాగే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లో  వరుసగా 25,000 రూ.. ఖర్చు చేసి  కొనుగోలు చేశారంటే  6Xలేదా  3X  రివార్డ్ పాయింట్‌లు వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్ కి వ్యాలిడిటి ఉండదు.

2.Joining Benefits

ఈ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే  మీరు క్రెడిట్  కార్డు తీసుకున్న 90 రోజుల లోపు 15,000 రూ.. లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే మీకు 500 వెల్కం ఓచర్ వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డు తీసుకున్న 90 రోజుల లోపు మీరు EMI పే చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది.

3.No annual fee

ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. కాబట్టి ఈ క్రెడిట్ కార్డు లో annual fee ఉండదు.

4.Interest free cash withdrawals 

ఫ్రెండ్స్ మీరు గనుక ఈ క్రెడిట్ కార్డు ని use చేసుకొని atm లో మనీ విత్ డ్రా చేశారంటే 48 రోజుల వరకు వడ్డీ ఏమి ఉండదు.  అంటే ఫ్రీ గా atm లో మని డ్రా చేసుకోవచ్చు.

5.OVL Charges

మిగతా క్రెడిట్ కార్డ్స్ తో పోలిస్తే ఈ క్రెడిట్ కార్డు ఉన్న ఫీచర్స్ లో ఇది బెస్ట్ ఫీచర్. ఎందుకంటే ఈ కార్డు ని ఉపయోగించి ఓవర్ లిమిట్ లో ఏవైనా కొనుగోలు చేశారనుకోండి ovl చార్జెస్ 2.5%  ఉంటుంది. అంటే 500కి లోపల ఉంటుంది.

6.

Low Interest Rates 

ఈ క్రెడిట్ కార్డ్లో వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. నెలకు 0.75% నుండి 3.5% వరకు ఉంటుంది. మిగతా బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ యొక్క వడ్డీతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

4. First wealth Credit Card

IDFC క్రెడిట్ కార్డ్స్ లో ఫస్ట్ వెల్త్ క్రెడిట్ కార్డు ఒకటి. ఇందులో ఎవర్‌గ్రీన్ రివార్డ్‌లు, ట్రావెల్ బెనిఫిట్. తక్కువ వడ్డీ వంటి ప్రయోజనాలు మనం పొందవచ్చు. ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం.

IDFC wealth credit card in telugu

First wealth Credit Card Features In Telugu 

ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ ఫస్ట్ వెల్త్ క్రెడిట్ కార్డు ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

1.Reward Points

మీరు ఈ క్రెడిట్ కార్డు ను use చేసి నెలలో 30,000 రూ.. లేదా అంత ఎక్కువ  ఖర్చు చేస్తే మీకు 10X రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. వీటికి వ్యాలిడిటి ఉండదు. ఇంకా మీరు ఆన్లైన్ లో కానీ ఆఫ్ లైన్ లో కానీ ఈ క్రెడిట్ కార్డు ని ఉపయోగించి నెలకు 30,000 రూ ఖర్చు చేస్తే మీకు 6X లేదా  3X రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఆన్‌లైన్ లేదా స్టోర్‌లో మీరు ఏదైనా కొనుగోలు చేస్తే  తక్షణమే  రివార్డ్ పాయింట్లు  వస్తాయి.

2.Joining Benefits

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డ్లో కూడా పైన క్రెడిట్ కార్డ్స్ లో ఉన్న జాయినింగ్ బెనిఫిట్స్ ఉంటాయి.  మీరు క్రెడిట్  కార్డు తీసుకున్న 90 రోజుల లోపు 15,000 రూ.. లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే మీకు 500 వెల్కం ఓచర్ వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డు తీసుకున్న 90 రోజుల లోపు మీరు EMI పే చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది.

3.Late Payment Fee

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో ఏదైనా లేట్ పేమెంట్ చేశారనుకోండి ఫి 15% ఉంటుంది. మిగతా క్రెడిట్ కార్డ్స్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ.

4.No Annual fee

IDFC బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ కి ఉన్న ఫీచర్స్ లో ఇది చాలా ముఖ్యమైనది. ఈ ఫస్ట్ వెల్త్ క్రెడిట్ కార్డు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. ఈ కార్డ్లో  annual fee ఉండదు.అంటే 0

5.Interest Free Cash Withdrawals 

ఫ్రెండ్స్ మీరు ఈ ఫస్ట్ వెల్త్ క్రెడిట్ కార్డు లో ఏవైనా క్యాష్ విత్ డ్రా చేస్తే మీకు  Interest రేట్ ఉండదు. అంటే వడ్డీ అనేది ఉండదు. ఫ్రీ గా క్యాష్ విత్ డ్రా చేసుకోవవచ్చు.

5.First Private Credit Card

ఫ్రెండ్స్ IDFC బ్యాంకు నుంచి పొందే క్రెడిట్ కార్డ్స్ లో ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డు ఒకటి. ఇది మిగతా క్రెడిట్ కార్డ్స్ తో పోలిస్తే కొంచం కాస్ట్లీ క్రెడిట్  కార్డు అని చెప్పవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ని  ఇన్విటేషన్ ద్వారా మాత్రమే పొందగలం.కార్డు లిమిట్ 20  లక్షలతో స్టార్ట్ అవుతుంది. ఈ క్రింద ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

idfc first private credit card in telugu 2023

First Private Credit Card In Telugu 

ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.Reward Points

ఫ్రెండ్స్ మనం ఈ క్రెడిట్ కార్డ్లో చాలా రకాలుగా రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు  అవి:

  • మీరు ఈ క్రెడిట్ కార్డు లో నెలలో 30,000 రూ.. కంటే తక్కువ ఖర్చు చేశారనుకోండి . మీరు ఆ ఖర్చు ఆన్లైన్ లో చేస్తే 6x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అదే ఖర్చు ఆఫ్ లైన్ లో చేస్తే 3x రివార్డ్ పాయింట్స్ వస్తాయి.
  • మీరు నెలలో  30,000 రూ.. కంటే ఎక్కువ ఖర్చు చేశారనుకోండి. మీకు 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి.
  • ఇంకా మీరు ఈ క్రెడిట్ కార్డ్లో పుట్టిన రోజు కు ఖర్చు చేస్తే మీకు 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి.
  • ఇవే కాకుండా 25% బోనస్ రివార్డ్ పాయింట్స్ కూడా పొందవచ్చు.

2.Annual Fee 

మనం IDFC బ్యాంకు లో వాడే క్రెడిట్ కార్డ్స్ లో ఈ క్రెడిట్ కార్డు కొంచం కాస్ట్లీ క్రెడిట్ కార్డు ఎందుకంటే ఇందులో య్యనువల్ ఫి కొంచం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఒక సంవత్సరంకి 50,000 రూ,, + GST య్యనువల్ ఫి ఉంటుంది.

3.Commencement Fee Benefit

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో మనం 50,000 రూ జాయినింగ్ ఫి పే చేసినందుకు గాను 2,00,000 బోనస్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వాటితో ఆన్లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో  ఏదైనా కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు క్యురేటేడ్ తాజ్ ఎవిక్యుర్ లో మెంబర్ షిప్ ని కూడా పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డు కి ఉన్న ఫీచర్స్ లో  ఇది ఒక బెస్ట్ ఫీచర్.

4.Annual Fee Benefit

ఈ క్రెడిట్ కార్డు లో మీరు య్యనువల్ ఫీ బెనిఫిట్ పొందవచ్చు. ఎలా అంటే మీరు ఈ క్రెడిట్ కార్డు లో 25.000 రూ.. య్యనువల్ ఫీ పే చేశారనుకోండి మీరు 1.00,000 బోనస్ రివార్డ్ పాయింట్స్  పొందవచ్చు. అలాగే వీటితో పాటు క్యురేటేడ్ తాజ్ ఎవిక్యుర్ లో మెంబర్ షిప్ ని  రినివల్ చేసుకోవచ్చు.

5.GlobalBenefit

  • ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో Forex Markup ఫి అనేది ఉండదు. అంటే మీరు ఈ క్రెడిట్ కార్డు ని అంతర్జాతీయంగా ఫ్రీ గా వినియోగించుకోవచ్చు.
  • మీరు atm లలో క్యాష్ విత్ డ్రా ఎక్కడ చేసుకున్నా 48 రోజుల వరకు వడ్డీ ఉండదు.
  • ఇంకా ఇందులో ట్రావెల్ అండ్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ పొందవచ్చు.

6. No Late Payment Charges 

మీరు ఈ క్రెడిట్ కార్డు బిల్లు పే కొంచం లేట్ గా చేసిన చార్జెస్ ఏమి పడవు. అంటే ఈ  ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్లో లేట్ పేమెంట్ ఫీ ఉండదు.

7.Low Interest Rates 

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డ్లో వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. వడ్డీ 9% మాత్రమే వసూలు చేస్తారు.

 6.First Wow Credit Card

ఫ్రెండ్స్ HDFC క్రెడిట్ కార్డ్స్ లో  ఈ ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డు ఒకటి.ఈ క్రెడిట్ కార్డు ని  స్టూడెంట్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, అందరూ పొందవచ్చు.  ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డు గురించి వివరంగా క్రింద తెలుసుకుందాం.

idfc wow credit card in telugu 2023

First Wow Credit Card Features In Telugu 

ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

 

1.Reward Points

ఫ్రెండ్స్ ఇందులో 4x రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు. ఈ రివార్డ్ పాయింట్స్ కీ ఎక్స్ పెరి డేట్ ఉండదు. రివార్డ్ పాయింట్లను ఎప్పుడైనా, ఎక్కడైనా ఆన్లైన్ లో రీడిమ్ చేసుకోవచ్చు.

2.No Joining Fee

ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డు లో జాయినింగ్ ఫి ఉండదు. ఇదే ఈ కార్డు  గల బెస్ట్ ఫీచర్.

3.Low Interest Rates

ఈ క్రెడిట్ కార్డు లో వడ్డీ రేటు 9% నుంచి 42% మధ్య ఉంటుంది. మిగతా బ్యాంకు ల క్రెడిట్ కార్డు లతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

4.Free Cash Withdrawals 

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు తో మనం atm లో క్యాష్  విత్ డ్రా  చేస్తే 48 రోజుల వరకు వడ్డీ ఉండదు.

5. Pay In Installments 

ఫ్రెండ్స్ మీరు ఈ క్రెడిట్ కార్డు ని use చేసి ఏదైనా ఆన్లైన్ కొనుగోలు చేసుకొని అమౌంట్ మొత్తం ఒకేసారి పే చేయకుండా emi లోకి మార్చుకొని ఇంస్టాల్మెంట్ లో నెల నెల కొంచం పే చేసుకోవచ్చు.

IDFC Credit Card Apply Link 

Leave a Comment