Icici Zero Balance Account Opening Online In Telugu
ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి పెద్ద బ్యాంకు లలో ICICI బ్యాంకు రెండవది. దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు 3600 బ్రాంచ్ లు, 11600 ATM లు ఉన్నాయి. ఈ బ్యాంకు లో కూడా మనం చాలా రకాల అకౌంట్స్ ని ఓపెన్ చేసుకోవచ్చు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇందులో మనం మినిమం అమౌంట్ ఉంచాల్సిన అవసరం ఉండదు. ఫ్రీగా ATM కార్డు, పాస్ బుక్ ని పొందవచ్చు.
ఈ ఆర్టికల్ లో మనం ICICI జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి, డాకుమెంట్స్ ఏమి కావాలి?, అర్హత ఏంటి అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
Icici Zero Balance Account Eligibility
ఫ్రెండ్స్ icici బ్యాంకు లో జీరో బ్యాలన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 18 ఏళ్ళ పైన ఉండాలి.
- ICICI బ్యాంకు లో సేవింగ్స్ అకౌంట్ ఉండకూడదు.
Icici Zero Balance Account Required Documents
ఈ క్రింద ICICI లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- ఆధార్ తో లింక్ అయినటువంటి మొబైల్
Icici Zero Balance Account Opening Online In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ICICI జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఆన్లైన్ లో ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ICICI బ్యాంకు వెబ్సైట్ కి వెళ్ళండి.
- మీ మొబైల్ , పాన్ కార్డ్ నెంబర్స్ , ఇ మెయిల్ ఐడి ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నెంబర్ కి ఒక otp వస్తుంది.దాన్ని ఎంటర్ చేయండి.
- ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి Proceed పై క్లిక్ చేయండి.
- మళ్ళి మీ మొబైల్ కి otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
- మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయండి.
- నామిని డిటైల్స్ కావాలంటే ఎంటర్ చేసుకోండి.
- తర్వాత మీ తల్లితండ్రులు ల వివరాలు ఎంటర్ చేయండి.
- మీ అడ్డ్రెస్ డిటైల్స్ వస్తాయి వాటిని చెక్ చేసుకొని continue పై క్లిక్ చేయండి.
- తర్వాత రెఫరల్ కోడ్ ఆప్షన్ వస్తుంది మీకు కావాలంటే yes పై వద్దు అనుకుంటే no ఫై క్లిక్ చేయండి.
- మళ్ళి మీ మొబైల్ నెంబర్ కి otp వస్తుంది దాన్ని ఎంటర్ చేయండి.
- e kyc చేసుకోండి.
Icici Zero Balance Account Features In Telugu
ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ icici జీరో బ్యాలన్స్ అకౌంట్ ఆన్లైన్ లో ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఈ క్రింద మనం ఈ అకౌంట్ లో ఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
- ఈ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం ఉండదు.
- ఫ్రీ గా ATM పొందవచ్చు.
- 1 లక్ష వరకు మినిమం అమౌంట్ ని సేవ్ చేసుకోవచ్చు.
- 1 లక్షక్రెడిట్ చేసుకోవచ్చు.
- ఆరు నెలల వరకు లావాదేవీలు జరుపకపోయిన అకౌంట్ ఆక్టివ్ లోనే ఉంటుంది.