Axis Bank Zero Balance Account Opening Online in Telugu
ఫ్రెండ్స్ మన అందరికి ఆక్సిస్ బ్యాంకు గురించి తెలిసే ఉంటుంది. Axis బ్యాంకు ను ఇంతకు ముందు UTI బ్యాంకు గా పిలిచేవారు. Axis బ్యాంకు లో మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ జీరో బ్యాలన్స్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం ఉండదు. ఈ క్రింది మనం ఈ Axis బ్యాంకు లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఆన్లైన్ లో ఎలా ఓపెన్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
Axis Bank Zero Balance Account Eligibility
మనం ఈ యాక్సిస్ బ్యాంకు లో జీరో బాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 18 ఏళ్ళ ఉండాలి.
- Axis బ్యాంకు లో సేవింగ్ అకౌంట్ ఉండకూడదు.
Axis Bank Zero Balance Account Required Documents
Axis బ్యాంకు లో జీరో బ్యాలెన్స్ ఓపెన్ చేసుకోవాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- ఆధార్ తో లింక్ అయినటువంటి మొబైల్
Axis Bank Zero Balance Account Opening Online in Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఆన్లైన్ లో Axis బ్యాంకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా Axis బ్యాంకు వెబ్సైట్ కి వెళ్ళండి.
- అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత త్రీ డాట్స్ పై క్లిక్ చేయండి.
- ఆందులో explore Product పై క్లిక్ చేసి accounts పై క్లిక్ చేయండి.
- అందులో saving account పై క్లిక్ చేయండి.
- అందులో చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి వాటిలో small basic savings account లో get a call back పై క్లిక్ చేయండి.
- మీ పేరు, ఇ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేసి submit ఫై క్లిక్ చేయండి.
- అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది.
- మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు బ్రాంచ్ కాల్ వస్తుంది.
- వాళ్ళు మీరు ఈ బ్యాంకు లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా అని కొన్ని ప్రశ్నలు అడుగుతారు వాటికీ సమాధానాలు ఇవ్వండి.
- తర్వాత బ్రాంచ్ వాళ్ళు వీడియో కాల్ చేస్తారు. కాల్ లో వాళ్ళు అడిగిన డాకుమెంట్స్ చూపించండి.
- మీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.
Axis Bank Zero Balance Account Features
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ Axis బ్యాంకు జీరో బ్యాలన్స్ అకౌంట్ లో ఏ ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం.
- ఈ జీరో బ్యాలేన్స్ అకౌంట్ లో మినిమం అమౌంట్ ఉంచాల్సిన అవసరం ఉండదు.
- 1 లక్ష వరకు అమౌంట్ ని సేవ్ చేసుకోవచ్చు.
- ఫ్రీ atm కార్డు పొందవచ్చు.
- అకౌంట్ ని కొన్ని నెలలు వాడకపోయినా ఆక్టివ్ గా ఉంటుంది.