HDFC Zero Balance Account Opening Online in Telugu
హాయ్ ఫ్రెండ్స్ HDFC బ్యాంకు గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ప్రైవేట్ రంగంలో బ్యాంకును ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నుండి ఆమోదం పొందిన బ్యాంకు లలో HDFC బ్యాంకు ఒకటి. HDFC జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో మిగతా అకౌంట్స్ లాగానే లావాదేవీలు జరుపవచ్చు. మనం ఈ అకౌంట్ లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ అకౌంట్ లో మనం మినిమమ్ బ్యాలన్సు ఉంచాల్సిన అవసరం ఉండదు.
ఈ క్రింద మనం HDFC బ్యాంకు లో జీరో బ్యాలెన్స్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మన వద్ద ఏ ఏ డాకుమెంట్స్ ఉండాలి. అర్హత ఏంటి అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
HDFC Zero Balance Account Eligibility
మనం ఈ hdfc బ్యాంకు లో జీరో బ్యాలన్స్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలి అంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 18 ఏళ్ళ పైన ఉండాలి.
- hdfc బ్యాంకు లో సేవింగ్స్ అకౌంట్ ఉండకూడదు.
HDFC Zero Balance Account Required Documents
ఫ్రెండ్స్ hdfc బ్యాంకు లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ ఓపెన్ చేసుకోవాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- ఆధార్ తో లింక్ అయినటువంటి మొబైల్
HDFC Zero Balance Account Opening Online in Telugu
ఈ క్రింద మనం ఆన్లైన్ లో hdfc బ్యాంకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా hdfc బ్యాంకు వెబ్సైట్ లోకి వెళ్ళండి.
- ఆధార్, పాన్ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- సెలెక్ట్ అకౌంట్ టైప్ లో సేవింగ్ ఫార్మర్ VLE ని సెలెక్ట్ చేసుకోండి.
- బ్రాంచ్ డిటైల్స్ సెలెక్ట్ చేసుకోండి.
- తర్వాత అకౌంట్ టైప్ వస్తుంది ప్రోసిడ్ బటన్ పై క్లిక్ చేయండి.
- kyc చేసుకోండి.
- పర్సనల్ డిటైల్స్, అకుపేషనల్ డిటైల్స్ ఎంటర్ చేయండి.
- తర్వాత మీ మ్యారిటల్ డిటైల్స్ సెలెక్ట్ చేయండి.
- తర్వాత మీ తల్లితండ్రులు ల వివరాలు ఎంటర్ చేయండి.
- మీ మంత్లీ స్టేట్మెంట్స్ మీ ఇమెయిల్ ఐడి కి రావాలా వద్ద అని సెలెక్ట్ చేసుకోండి.
- నామిని డిటైల్స్ మీకు కావాలంటే ఎంటర్ చేసుకోండి.
- ప్రోవైడ్ అడ్డ్రెస్స్ లో మీ అడ్డ్రెస్స్ ను సెలెక్ట్ చేసుకోండి.
- డాకుమెంట్స్ అప్లోడ్ చేసుకోండి.
- ప్రోసిడ్ పై క్లిక్ చేయండి.
- వీడియో kyc చేసుకోండి.
పైన తెలిపిన విధంగా మీరు ఆన్లైన్ లో hdfc జీరో బ్యాలెన్సు అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు.
HDFC Zero Balance Account Benefits In Telugu
ఫ్రెండ్స్ ఈ hdfc జీరో బ్యాలెన్స్ అకౌంట్ వలన ఏ ఏ బెనిఫిట్స్ ఉన్నాయో క్రింద చూద్దాం.
- మినిమం అమౌంట్ ని ఈ అకౌంట్ లో ఉంచాల్సిన అవసరం లేదు
- ఇందులో 1 లక్ష వరకు మినిమం అమౌంట్ ని సేవ్ చేసుకోవచ్చు.
- 1 లక్ష వరకు మాత్రమే క్రెడిట్ చేసుకోవచ్చు.
- ఆరు నెలల వరకు లావాదేవీలు జరుపకపోయిన అకౌంట్ ఆక్టివ్ లోనే ఉంటుంది.