SBI Zero Balance Account Opening Online In Telugu
ఫ్రెండ్స్ మన అందరికి SBI బ్యాంకు గురించి తెలిసే ఉంటుంది. మన దేశంలో ఉన్నటువంటి బ్యాంకులలో sbi అతి పెద్ద బ్యాంకు. ఈ బ్యాంకు లో చాలా రకాల ఖాతాలను ఓపెన్ చేసుకోవచ్చు. అటువంటి వాటిలో SBI జీరో బాలెన్సు అకౌంట్ ఒకటి. ఇందులో ఖాతాదారుడు అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక్కమాటలో చెప్పాలి అంటే ఈ అకౌంట్ లో మిగతా అకౌంట్స్ లో లాగా బాలెన్సు మేంటైన్ చేయనవసరం లేదు. ఉదాహరణకు: ఇప్పుడు SBI సేవింగ్ అకౌంట్ లో అయితే 1000 రూ.. మినిమం బ్యాలెన్స్ ఉండాలి. అదే ఈ జీరో అకౌంట్ లో ఇలా మినిమం అమౌంట్ మేంటైన్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఈ క్రింద మనం ఈ sbi zero balance Account ఎలా ఓపెన్ చేసుకోవాలి, మనం ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే డాకుమెంట్స్ ఏమి కావాలి, అర్హత ఏమి ఉండాలో వివరంగా తెలుసుకుందాం.
SBI Zero Balance Account Eligibility
SBI లో జీరో బ్యాలెన్సు అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఈ క్రింది అర్హతలు మనకు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 18 ఏళ్ళు ఉండాలి.
- SBI బ్యాంకు లో సేవింగ్ అకౌంట్ ఉండకూడదు.
SBI Zero Balance Account Required Documents
SBI లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఈ క్రింది డాకుమెంట్స్ మన వద్ద ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- ఆధార్ తో లింక్ అయినటువంటి మొబైల్
SBI Zero Balance Account Opening Online In Telugu
ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ sbi జీరో అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మన వద్ద ఏ డాకుమెంట్స్ ఉండాలి, అర్హత ఏమి ఉండాలో క్లియర్ గా తెలుసుకున్నాం. ఈ క్రింద మనం ఈ అకౌంట్ ని ఎలా ఆన్లైన్ లో ఓపెన్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
మనం SBI లో Zero Balance అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే బ్యాంకు వెళ్ళాల్సిన అవసరం. సులభంగా మనమే SBI YONO యాప్ ద్వారా లేదా SBI అధికారిక సైట్ ద్వారా ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఈ క్రింద మనం ఈ అకౌంట్ ని ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం.
- మొదట sbi yono యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత allow యాక్సెస్ చేసుకోండి.
- తర్వాత new sbi పై క్లిక్ చేయండి.
- తర్వాత Insta సేవింగ్ ఖాతా అప్లై పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ నెంబర్ కి otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి.
- తర్వాత అప్లికేషను పాస్ వార్డ్ ని క్రియేట్ చేసుకోండి.
- మీ పర్సనల్ డిటైల్స్ ఎంటర్ చేయండి.
- తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి వాటిలో ఎంటర్ ఆధార్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకోండి.
- వెంటనే మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ కి ఒక otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి.
- తర్వాత మీ పర్సనల్ డిటైల్స్ అన్ని ఆటోమాటిక్ గా వచ్చేస్తాయి. వాటిని క్లియర్ గా చెక్ చేసుకొని next పై క్లిక్ చేయండి.
- మళ్ళి ఇక్కడ కోన్ని మీ పర్సనల్ అడుగుతుంది వాటిని ఎంటర్ చేయండి.
- తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- తర్వాత మీ ఆధార్ కార్డ్ లో ఉన్న ఫోటో ఆటోమాటిక్ గా వస్తుంది దాన్ని చెక్ చేసుకొని next పై క్లిక్ చేయండి.
- తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి.
- తర్వాత మీ మ్యారిటల్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి.
- తర్వాత మీ తల్లితండ్రులు ల వివరాలు ఎంటర్ చేయండి.
- మీ యొక్క వార్షిక ఆదాయం ని సెలెక్ట్ చేసుకోండి.
- తర్వాత మీ యొక్క వృత్తి, మతం ని సెలెక్ట్ చేసుకోండి.
- తర్వాత నామిని వివరాలు ఇవ్వండి.
- తర్వాత హోమ్ బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోండి. బ్రాంచ్ వివరాలు ఎంటర్ చేయండి.
- ఇప్పుడు షరతులను అంగీకరించి, మీ మొబైల్ కి OTP వస్తుంది దాన్ని ఎంటర్ చేసి నమోదు చేసుకోండి.
- మీరు డెబిట్ కార్డ్లో ప్రింట్ చేయాలనుకుంటున్న పేరు ను ఎంటర్ చేయండి. ఈ డెబిట్ కార్డ్ అప్లై చేసిన 15 రోజులలో మీ అడ్రెస్స్ కు డెలివరి అవుతుంది.
- తర్వాత మీ అకౌంట్ డిటైల్స్ వస్తాయి. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్ sbi.com ని ఓపెన్ చేసి అందులో మీ యూసర్ ఐడి పాస్ వార్డ్ ని ఎంటర్ చేసి మీ అకౌంట్ ని యాక్టివేట్ చేసుకోండి.
SBI Zero Balance Account Features In Telugu
sbi జీరో అకౌంట్ ని sbi insta సేవింగ్ అకౌంట్ అని కూడా పిలుస్తారు. ఈ క్రింద ఈ అకౌంట్ లో ఏఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
- ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో మినిమం బాలెన్సు పెట్టాల్సిన అవసరం ఉండదు.
- ఈ అకౌంట్ 12 నెలలు యాక్టివ్ గా ఉంటుంది.
- ఇందులో 1 లక్ష వరకు మినిమం అమౌంట్ ని సేవ్ చేసుకోవచ్చు.
- 1 లక్ష వరకు మాత్రమే క్రెడిట్ చేసుకోవచ్చు.